Skip to main content
BBS = BOYBOYSAI

BBS = BOYBOYSAI

By BOY..BOY SAI

Available on
Overcast Logo
Pocket Casts Logo
RadioPublic Logo
Spotify Logo
Currently playing episode

Happy ఫోటోగ్రఫీ డే

BBS = BOYBOYSAIAug 19, 2021

00:00
00:37
Happy ఫోటోగ్రఫీ డే

Happy ఫోటోగ్రఫీ డే

నువ్వు ఎలా ఉంటావో అనే విషయం
నీ next జనరేషన్ కి తెలియాలి అంటే..మీ ఇంట్లో నీ ఫోటో ఉండాలి..!!
నీ ఫోటో గోడమీద ఉంటే...కిందున్నట్టు..
దానికి దండేసి ఉంటే నువ్వు బకెట్ తన్నేసినట్టు..
Happy world ఫోటోగ్రఫీ డే
#BOYBOYTV
#BOYBOYSAI
Aug 19, 202100:37
గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచ్చాయ్ వ్యక్తి గత అనుభవం BOYBOYSAI స్టేటస్ రేడియో లో

గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచ్చాయ్ వ్యక్తి గత అనుభవం BOYBOYSAI స్టేటస్ రేడియో లో

గూగుల్ సంస్థ సీఈఓ సుందర్ పిచ్చాయ్ వ్యక్తి గత అనుభవం BOYBOYSAI స్టేటస్ రేడియో లో
Feb 04, 202103:31
ముంబై లోకల్ ట్రైన్...

ముంబై లోకల్ ట్రైన్...

ముంబై: దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబైలో కొన్ని ల‌క్ష‌ల మంది జీవితాలు లోక‌ల్ రైళ్లతో ముడి పడి ఉంటాయి. ఎంతోమందికి అవి జీవ‌నాధారం. అలాంటి జీవ‌నాధారం 11 నెల‌లుగా దూర‌మైతే ప‌రిస్థితి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. క‌రోనా కార‌ణంగా గ‌తేడాది మార్చిలో ఆగిపోయిన లోక‌ల్ రైళ్లు.. మొన్న ఫిబ్ర‌వ‌రి 1 నుంచి మ‌ళ్లీ సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. ఈ సంద‌ర్భంగా ఓ ఫొటో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో వైర‌ల్‌గా మారిపోయింది. లోక‌ల్ రైలుకు ముంబై ప్ర‌జ‌లు త‌మ జీవితాల‌లో ఎలాంటి స్థానం ఇస్తారో క‌ళ్ల‌కు క‌ట్టే ఫొటో ఇది. చాలా నెల‌ల త‌ర్వాత క‌ళ్ల ముందు ప్ర‌త్య‌క్ష‌మైన లోక‌ల్ రైలును చూసి ఓ ప్ర‌యాణికుడి మ‌న‌సు ఉప్పొంగిపోయింది. వెంట‌నే దాని ముందు మోక‌రిల్లి దండం పెట్టాడు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయింది. లోక‌ల్ రైలు అనేది కేవ‌లం ఒక ప్ర‌యాణ సాధ‌నం కాదు.. ఓ భావోద్వేగం అని ఎంతోమంది కామెంట్ చేశారు.
Feb 04, 202101:20
#Lyricist

#Lyricist

చాలా సార్లు మనం సినిమా పేర్లు మర్చిపోతాం కానీ ఆ సినిమాలో ఉన్న పాటలు మాత్రం గుర్తుపెట్టుకుంటాం..కొన్ని సార్లు కొన్ని సంవత్సరాలు పాటు మన నోట అదే పాటను పాడుతూ ఉంటాం కూడా..మన ఇండస్ట్రీ లో కొన్ని వేల సినిమాలు పాటలు ద్వారా నే హిట్ అయ్యాయి.. ఒక సినిమా ని మొదటిగా మార్కెట్ చేసేది పాట మాత్రమే..సినిమా ఫీల్డ్ లో అందరికి ఎదో ఒకరూపం లో work out అవుతాది కానీ పాటలు రాసిన వ్యక్తి కి మాత్రం work out కాదు..ఎందుకంటే పాట రాసే వ్యక్తి డబ్బు కోసం కంటే నా పాట ఎన్ని లక్షల మంది పాడుకుంటున్నారు అనే ఆత్మ సంతృప్తి తోనే ఎక్కువ బ్రతుకుతాడు..
ఈరోజు ఇ విషయం అంతా ఎందుకు చెప్తున్నాను అంటే నా ఫెవరేట్ lyricist వెన్నెల కంటి గారు ఈరోజు పరమపదించారు ..ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి అని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.. ఆయన ఎన్నో వందల అనువాద గీతాలు రాసారు..నాకు వెన్నెల కంటి గారు రాసిన పాటలలో ఇష్టమైన పాట హృదయం ఎక్కడున్నది గజిని లో పాట.. నేను ఆ పాట ని కొన్ని సంవత్సరాల పాటు పాడుకున్నాను..RIP sir జై హింద్ వెన్నెలకంటి.
Jan 05, 202100:56
#BOYBOYSAI @YashwanthNag

#BOYBOYSAI @YashwanthNag

నేను రాసి చౌరస్తా యశ్వంత్ నాగ్ స్వరపరిచిన నీ నీడ నేనంటు సాంగ్..
Dec 16, 202002:45
#tagబంద్ లు వద్దు ..!! ముందు విషయం ఏంటో తెలుసుకొని దేశానికి ఉపయోగపడే బంద్ లే ముద్దు.!!

#tagబంద్ లు వద్దు ..!! ముందు విషయం ఏంటో తెలుసుకొని దేశానికి ఉపయోగపడే బంద్ లే ముద్దు.!!

దేశంలో కొత్త చట్టాలు తెచ్చేటప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో అసలు ఏముందో అనే విషయాన్ని స్పష్టంగా అన్ని భాషలలో అర్థం అయ్యేలా బిల్ పాస్ చెయ్యాలి.. విలు ఉంటే దానికోసం ఒక డాక్యుమెంటరీ తీస్తే ఇంకా మంచిది ..నువ్వు చేసే మంచి ఏంటో ...అసలు విషయం ఏంటో దేశం మొత్తం తెలియాలి గా ముందు..నాకు తెలిసి పార్లమెంట్ లో ఉన్న 80% మన MP లకు అసలు బిల్ లో ఎమ్ ఉందొ తెలియదు..ఒక ఎంపీ కే బిల్ గురించి అవగాహన లేనప్పుడు.. ఒక సామాన్య మానవుడి కి ఎమ్ తెలుస్తాది..మనం ఒకరికి న్యాయం చెయ్యాలి అని అవగాహన లేకుండా బంద్ లు పెడితే దేశానికి ఎమ్ ఉపయోగం లేదు..ఎక్కడో ఢిల్లీలో లో ఒక గొర్రి బంద్ అంటే దేశం మొత్తం బంద్ పెట్టేస్తారా... అక్కడ పరిస్థితులు ఏంటి... ఇక్కడ పరిస్థితులు ఏంటి అవి ఇక్కడి రైతులకు ఎంత వరకు ఉపయోగ పడతాయో కూడా తెలుసుకొని బందులు చెయ్యాలి..ఇవన్నీ జరగ కుండా ఉండాలి అంటే దేశం మొత్తం అర్థం అయ్యేలా బిల్ పాస్ చెయ్యాలి..జై హింద్
#boyboytv #boyboysai #భారత్ బంద్ #టాగ్ బందులు వద్దు...!
ముందు విషయం ఏంటో తెలుసుకొని దేశానికి ఉపయోగ పడే బందులు ముద్దు..!!
Dec 09, 202001:27
బావర్చి బిర్యానీ

బావర్చి బిర్యానీ

బావ వచ్చి కాదు.. బావర్చి... ఎమన్నా పేరు పెట్టారు కదా ఒక్కప్పుడు హైదరాబాద్ లో ఫెమస్ బిర్యానీ సెంటర్...ఎవడికి బాధోచ్చిన వచ్చినా.. సంతోషం వచ్చినా.. ఇక్కడికి వచ్చి బిర్యానీ తినాల్సిందే..
పార్సిల్ పెద్దగా... టెస్ట్ ఎక్కువగా రేటు తక్కువగా..ఇప్పటికి నాకు గుర్తు ఎవరైనా rtc క్రాస్ రోడ్స్ లో క్లాస్ కి వెళ్లి వస్తే బావ ఆ బావర్చి లో బిర్యానీ పార్సిల్ తెచ్చి full గా కుమ్మేద్దాం..ఎవరి birthday అయినా ..newyear పార్టీ అయినా..రూమ్ లో ఏ గొడవ అయినా..అమ్మాయి లవ్ రిజెక్ట్ చేసినా.. ok చెప్పినా సంతోషం వచ్చినా బాధ వచ్చినా..బావ బావర్చి..
After 11years తరువాత ఈరోజు మా sanwik తో కలిసి వెళ్ళా బావర్చి బిర్యానీ తినడానికి..అప్పుడు ఉన్న బావర్చి లో రుచి ఇప్పడు అస్సలు ఎక్కడ తెలియలేదు..ఇలాగే ఉంటే బావర్చి పేరు బావ ని మరచి అయిపోతాది..!!
Dec 06, 202001:05
ఉసురు.. ముసురు.. !!

ఉసురు.. ముసురు.. !!

దాని ఇంటికి అది కరెక్ట్ గానే వచ్చింది..
నువ్వే దారితప్పి కబ్జా చేసావ్ దాని ఇంటిని..
దాని ఉసురు పోసుకున్నావ్
అందుకే ఈరోజు ముసురు పెట్టి చంపుతుంది..
ఇట్లు మీ సాయి. ఆరిశెట్టి.. 🙏
Oct 14, 202000:20
అనుభవించు రాజా.. !!😂😂👌😜

అనుభవించు రాజా.. !!😂😂👌😜

గూగుల్ పే లో మూడు నెలలకు 5 రూపాయలు వస్తే ఎగిరి గంతెస్తాం..

పెట్రోల్ మీద రోజూ కొంచెం పెంచి నెలకు 50 రూపాయలు దోచేస్తుంటే పట్టించుకోము..

కూరగాయలు అమ్మే ముసలమ్మ దగ్గర గీచి గీచి బేరమాడి 5 రూపాయలు మిగిల్చి ఏదో మిగిల్చినట్టు ఫీల్ అవుతామ్..

పక్కకొచ్చి 20 రూపాయలతో సిగరెట్ కాలుస్తాం..

మందు బాటిల్ 1500 పెట్టి దర్జాగా కొంటాం..

అదే 1500 వందలతో ఇంట్లోకి ఫ్రూట్స్ కొనడానికి ఆలోచిస్తాం..

వచ్చే పైసా గురించి ఆలోచిస్తాం కానీ పోయే రూపాయి గురించి పట్టించుకోము..

మన మధ్యతరగతి ఆలోచనలు ఇలా ఉంటాయి అని తెలుసు కాబట్టే..

ఆసరా...భరోసా అని 10 వేలు అకౌంట్ లో వేసి 20 వేలు పన్నుల రూపంలో పిండుతుంటాయి ప్రభుత్వాలు..

వచ్చేది అదృష్టం కింద లెక్క..
పోయేది ఖర్చు కింద లెక్క...

మన అమాయకత్వమే వాళ్ళ బలం...

కోడిని కోసుకు తినాలి అంటే నాలుగు నూకలు వేస్తాం ..పట్టి కోసుకు తింటాం..

కోడి నూకలకు కక్కుర్తి పడుద్ది..
మనం పథకాలకు కక్కుర్తి పడతాం..

కోడికి మనకు పెద్ద తేడా లేదులే..

మన కాళ్ళ మీద మనలను నిలబెట్టేవాడు మనకు వొద్దు..
మన కాళ్ళు విరగ్గొట్టి వీల్ చైర్ ఇచ్చేవాడు మనకు ముద్దు..

మన ఆలోచనలు మారనంత వరకు పాలకుల తీరు మారాలి అనుకోవడం అమాయకత్వం ..

అనుభవించు రాజా..
Sep 18, 202001:35
BOYBOYSAI IPL PILLA SONG

BOYBOYSAI IPL PILLA SONG

నేను రాసి పాడి కంపోజ్ చేసిన సాంగ్.. ipl pilla 2107 ఫ్రెండ్స్ విని ఎలా ఉందో మీ విలువైనా ఫీడ్ బ్యాక్ ఇవ్వండి.. thank you..
Aug 16, 202003:19
ఒక అమ్మాయికి అబ్బాయి ఎలా Love ప్రపోజ్ చెయ్యాలి

ఒక అమ్మాయికి అబ్బాయి ఎలా Love ప్రపోజ్ చెయ్యాలి

నిన్ను నేనుగా చూసినప్పుడు నన్ను నేనే మరచిపోయా..
Jul 30, 202001:10
Love Life

Love Life

ప్రేమ అనేది అందమైన లోకం
Jul 30, 202000:59
బుద్ధుడు నిర్వికార నిర్వాణ యోగం - BOYBOYSAI

బుద్ధుడు నిర్వికార నిర్వాణ యోగం - BOYBOYSAI

ఒక ఇల్లు తగలబడి పోతోంది. జనం చుట్టూ చేరి చూస్తున్నారు.

యజమాని దూరoగా నిల్చుని రోదిస్తున్నాడు. ఎంతో అందమైన ఇల్లు.

పది రోజుల క్రితం ఎవరో రెట్టింపు ధర ఇస్తామన్నా అమ్మలేదు.

అందుకే దుఃఖం. ఇంతలో పెద్ద కొడుకు వచ్చాడు. "నీకు తెలీదా నాన్నా? మూడు రెట్లు ధర వస్తే, ఇల్లు నిన్నే అమ్మేసాను. నీకు చెప్పేటంత సమయం లేక పోయింది" అన్నాడు.

చేత్తో తీసేసినట్టు ఒక్క సారిగా వేదన పోయింది. గుండెల్నిండా సంతోషంగా గాలి పీల్చుకున్నాడు.

ఆ తరువాత తనూ ఒకడిగా మంటల్ని చూస్తూ పక్క వారి సంభాషణలో పాలు పంచుకొనసాగాడు…!

అదే ఇల్లు. అవే మంటలు. క్షణం క్రితం వరకూ ఉన్న అటాచ్‌మెంట్ పోయింది. ఇప్పుడు నిజం చెప్పాలంటే, కా... స్త ఆనందిస్తున్నాడు కూడా.

ఇంతలో రెండో కొడుకు వచ్చాడు. "నువ్వు సంతకం పెట్టకుండా అమ్మకం ఎలా పూర్తి అవుతుంది నాన్నా. ఆమాత్రం తెలీదా?" అన్నాడు. అంతే. తిరిగి దుఃఖం చుట్టు ముట్టింది.

ఈ లోపులో మూడో కొడుకు వచ్చి, "మాట మీద నిలబడే నిజాయితీ గల మనిషి ఆయన. మాటతోనే అమ్మకం జరిగిపోయిందన్నాడు. సగం డబ్బు చెల్లించేశాడు కూడా" అన్నాడు. తిరిగి సంతోషం పెనవేసుకుంది.

ఇది నాది’ అనుకున్నప్పుడు దుఃఖం వస్తోంది. కాదనుకున్నప్పుడు పోతోంది.

నిజానికి ఏమీ మారలేదు. ఇదే బుద్ధుడు చెప్పిన నిర్వికార నిర్వాణ యోగం.

*ఎవరి బాధైనా బాధే కదా , మనకి వస్తే బాధ , అవతలి వారికి వస్తే కాదు అనుకోవడం మన మనస్తత్వం అస్సలు అవ్వకూడదు.జాలిపడినా పడకపోయినా కాస్తంత ఓదార్పు ఇవ్వండి, వీలైతే సాయం చేయండి... 🙏🙏🙏boyboysai
Jul 29, 202002:45
SAI=IAS

SAI=IAS

SAI=IAS..మాటలు ఆడుతాడు ఆడిస్తాడు.. పాటలు పాడుతాడు పాడిస్తాడు.. డైలాగులు రాస్తాడు..చెప్పేస్తాడు.. S తో స్టార్ట్ అవుతా I తో end అవుతా మధ్యలో " A" లా no:1 లా ఉండాలి అనుకుంటా అండ్ మిమ్మల్ని కూడా no:1 చేసేస్తా ..
Jul 25, 202003:08
నాలో ఒక యువత అనే యుద్ధం ఉంది

నాలో ఒక యువత అనే యుద్ధం ఉంది

10సంవత్సరాల క్రితం నేను రాసిన
Jul 25, 202000:48