మాటల మూటలు
By వీవెన్
మన తెలుగు మాటల గురించి, వాటిలో దాగివున్న అర్థాల మూటల గురించి కొన్ని మాటలు
మాటల మూటలుFeb 14, 2020
00:00
10:15
ద్వంద్వప్రమాణాలు ద్విగుణీకృతం
ఈ విడతలో రెండు, రెండవ అనే అర్థాలలో సంస్కృతం నుండి వచ్చిన ద్వి, ద్వయ, ద్వంద్వ తదితర మాటలను తెలుసుకుందాం:
- (కొనసాగింపు) ఆది: ఆదివారం, ఆదిపురుషుడు, ఆద్యుడు, ఆదిభిక్షువు, ఆదిదంపతులు
- ద్వి: ద్విసంఖ్యామానం, ద్వయాంశ పద్ధతి
- ద్వయాక్షరి, ద్విత్వం, ద్విత్వాక్షరం, ద్విరుక్తం
- ద్వితీయం, అద్వితీయం, అద్వయం, అతిద్వయం
- ద్వితీయ → విదియ
- ద్విజుము, ద్విజుడు
- ద్వైతం, అద్వైతం, అద్వైతి, అద్వైయుడు
- ద్విగుణీకృతం
- ద్వయం: మిత్రద్వయం
- ద్వయి → దోయి → దోయిలి → దోసిలి
- ద్వంద్వం: ద్వంద్వ ప్రమాణాలు, ద్వంద్వనీతి, ద్వంద్వ వైఖరి, ద్వంద్వ పౌరసత్వం, ద్వంద్వ సమాసం
- నిర్ద్వంద్వం = మరోమాట లేకుండా తేల్చిచెప్పడం
- ద్వంద్వం → దొందం → దొందు: దొందూ దొందే
- ద్వైపాక్షిక సంబంధాలు, చర్చలు
మీ సందేశాలను, సందేహాలను నాకు తెలియజేయండి: ఆంకర్.ఎఫ్ఎమ్ సైటు ద్వారా లేదా నా ట్విట్టరు పేజీలో!
Feb 14, 202010:15
జోడు గుర్రాలపై స్వారీ
ఈ విడతలో మలి, జత, జంట, జోడు తదితర మాటల గురించి తెలుసుకుందాం:
- మరు → మలు → మలి: మలిచూపు, మల్చూరు, మలిసంధ్య/మలుసంజ, మలికారు
- జత, జతకట్టడం, జతపరచడం, జతచేయడం
- జంట, జంట నగరాలు
- జోడు
- జమలి/జమిలి: జమిలి ఎన్నికలు; జమిలించడం
- కవ: కనుగవ, చనుగవ, కవలలు
- అమడ: అమడలు, అమడకాయ, అమడమాటలు
- యుగళము, యుగ్మము: యుగళగీతం
మీ సందేశాలను, సందేహాలను నాకు తెలియజేయండి: ఆంకర్.ఎఫ్ఎమ్ సైటు ద్వారా లేదా నా ట్విట్టరు పేజీలో!
Feb 06, 202008:21
రెండు, ఇరు
ఈ మలి విడుతలో రెండు, ఇరు తదితర మాటల గురించి తెలుసుకుందాం.
- రెండు = 2, భేదము, తేడా
- ఇరుగురు → ఇరువురు → ఇద్దరు
- ఇరుక్కుపోవడం, ఇరకాటం
- ఇరుమూడు, ఇరునాలుగు, ఈరైదు, ఈరారు, ఈరేడు, ఈరెనిమిది, ఇరుపది → ఇరుబది → ఇరవై
- ఇనుమడించు
- ఇనుమడి → ఇన్మడి → ఇబ్బడి
- ఇబ్బడి, ముబ్బడి
- రెండు చేతులా సంపాదించడం
- రెండు నాల్కల ధోరణి
- రెండు కళ్ళ సిద్ధాంతం
మీ ప్రతిస్పందనలను తెలియజేయండి:
Jan 29, 202009:59
ఉభయతారకం
ఈ అదనపు భాగంలో ఉభయులు తదితర మాటల గురించి తెలుసుకుందాం!
- ఉభయతారకం
- ఉభయచరం
- ఉభయ కుశలోపరి
- ఉభయ గోదావరి జిల్లాలు
Jan 23, 202001:49
మొదలు, మొదటి, మొదలుపెట్టడం
ఇది మాటల మూటలు పాడ్కాస్టు తొలి భాగం. దీనిలో మొదలు, మొదటి, మొదలుపెట్టడం అనే అర్థాన్ని తెలిపే తెలుగు మాటల గురించి తెలుసుకుందాం.
- మొదలు, మొదటి, మొదటిగా, మొదలుపెట్టడం, మొట్టమొదలు
- తొలి, తొలుత, తొలుదొల్త, తొట్టతొలి
- ముందు, ముందుగా, మున్ముందు
- ఆరంభం, శుభారంభం, ఆరంభించు, ప్రారంభం, ప్రారంభించు
- ప్రథమం, ప్రధమ, ప్రప్రథమం
- ఆది, ఆద్యము
- మొదలుపెట్టడం: నాంది పలుకడం, అంకురార్పణ చేయడం, శ్రీకారం చుట్టడం, ఉపక్రమించడం, నడుంకట్టడం, నడుంబిగించడం, పట్టాలెక్కించడం
- మొదలవడం: మొలకెత్తు, మొగ్గతొడుగు, చిగురించు, రూపుదాల్చు, ఉదయించు, ఉద్భవించు, ఆవిర్భవించు
Jan 15, 202006:20